భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్ళీ అల్ టైమ్ హై లెవెల్ కి చేరుకునే అవకాశం ఉందా?

Date:

బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటున్నాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర, ఈరోజు 22 క్యారెట్ల 1 గ్రాము ధర ఏకంగా రూ. 210 పెరిగి రూ. 11,715 లకి చేరింది. డిసెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, యూఎస్ బాండ్ ఈల్డ్ దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ఈ విధంగా పెరుగుతూ ఉండడం బంగారం కొనాలనుకునేవారికి ఆందోళన కలిగిస్తోంది.

వచ్చే నెల అనగా డిసెంబర్ యూఎస్ ఫెడరల్ మరొకసారి వడ్డీ రేట్లని తగ్గించే అవకాశం ఉందని అంచనాలు పెరగడంతో బంగారం ధరలు మూడు వారాల గరిష్ట స్థాయికి చేరాయి. మరొకవైపు డాలర్ విలువ కూడా హెచ్చు తగ్గులకి గురవుతూ ఉండడంతో పాటు యూఎస్ బాండ్ ఈల్డ్ కారణంగా బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తుంది.

దీపావళి పండుగ ముందు వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు అనంతరం భారీగా పతనం అవ్వడం జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ బంగారం ధరలు అదే స్థాయిలో పెరగడం బంగారం కొనాలనుకునే వారికి ఆందోళలని కలిగిస్తుంది.

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర (Gold Price Today) ఏకంగా రూ. 210 పెరిగి రూ. 11,715 లుగాను, అలాగే 8 గ్రాముల బంగారం ధర రూ. 1680 పెరిగి రూ. 93,720 లుగా, అదేవిధంగా 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 2100 పెరిగి రూ. 1,17,150 లుగా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 2100 పెరిగింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...