ఐటీ షేర్ల ర్యాలీ.. భారీ లాభాల్లో సెన్సెక్స్..

Date:

ఐటీ షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతుండడం సూచీలకు కలిసొస్తోంది. బుధవారం ఐటీ సెక్టార్ ఏకంగా 2.5 శాతం పెరిగింది. మరోవైపు మంగళవారం విదేశీ మదుపర్లు రూ.755 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచబోతున్నట్టు వస్తున్న వార్తలు కూడా సానుకూలంగా మారాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.76) బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయి.

గత సెషన్ ముగింపు (76,765)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 761 పాయింట్ల లాభంతో 77,527 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 219 పాయింట్ల లాభంతో 24,204 వద్ద ఉంది (stock market news today).

సెన్సెక్స్‌, నిఫ్టీలో కేపీఐటీ టెక్, స్విగ్గీ, కొఫోర్జ్, సెయిల్, ఇన్ఫోసిస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఫియోనిక్స్ మిల్స్, మదర్సన్, కేఫిన్ టెక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, సీజీ పవర్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 287 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 396 పాయింట్ల లాభంతో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...