
విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం పత్తికొండకు వస్తున్నారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. మంగళవారం ఆయన పత్తికొండ మండలంలోని హోసూరు సమీపంలో నారా లోకేశ్ పర్యటన కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ సుమారు 2వేల ఎకారాల్లో ఏర్పాటుచేయనున్న టాటా, సుజ్‌లాన్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న సోలార్ ప్రాజెక్టు భూమిపూజలో ఆయన పాల్గొంటారన్నారు. హోసూరు సమీపంలో భారీజనంతో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలుకుతామన్నారు.
భూమి పూజ అనంతరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంద న్నారు. నియోజవర్గ అబ్జర్వర్ వడ్డే పోలన్న, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆలంకొండ నబీసాహెబ్, టీడీపీ నాయకులు మనోహర్‌చౌదరి, వెల్దుర్తి సుబ్బరాయుడు, జ్ఞానేశ్వర్ గౌడ్ స్థానిక నాయకులు అంజి, రాఘవేంద్ర, రాహుల్, సాయి ఉన్నారు.

