పూసపాటిరేగ మండలం వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స చైతన్యపై జనసేన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ వార్డులో ఆయనకు ఓటు హక్కు ఉందని పేర్కొంటూ జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి కోట్ల రేవతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

బొత్స చైతన్యకు UJK1667229 ఓటరు గుర్తింపు కార్డుతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఉన్నట్లు ఎన్నికల అధికారికి సమర్పించిన ఫిర్యాదులో రేవతి పేర్కొన్నారు. అక్టోబరు 22వ తేదీ వరకు 41వ వార్డులో ఓటు హక్కు కలిగి ఉన్న వ్యక్తి పూసపాటిరేగ మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ ఎలా దాఖలు చేశారని ప్రశ్నించారు.

కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఉన్న నేపథ్యంలో పూసపాటిరేగ మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయడంపై సమగ్ర విచారణ చేపట్టాలని రేవతి కోరారు. తన ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని విజ్ఞప్తి చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *