అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఆమోదం తెలిపింది.

వివిధ స్థానిక సంస్థల్లో ఎనిమిది కేటగిరీలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను కేబినెట్‌ ఖరారు చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  • పంచాయతీ వార్డు సభ్యులు: 26.73 శాతం
  • సర్పంచ్‌ స్థానాలు: 27.95 శాతం
  • ఎంపీటీసీ స్థానాలు: 25.55 శాతం
  • ఎంపీపీ పదవులు: 24.60 శాతం
  • జడ్పీటీసీ స్థానాలు: 24.60 శాతం
  • జడ్పీ చైర్మన్‌ పదవి: 23.08 శాతం
  • అర్బన్‌ వార్డులు: 32.78 శాతం
  • మున్సిపల్‌ చైర్మన్‌ పదవులు: 33.02 శాతం
  • మేయర్‌ పదవులు: 35.29 శాతం

బీసీ రిజర్వేషన్ల ఖరారుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తదుపరి చర్యలకు మార్గం సుగమం కానుంది. ఎన్నికల షెడ్యూల్‌, ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *