రాజధాని అమరావతిలో కీలక ఘట్టం.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.. వేగవంతంగా జర్నీ.

Date:

రాజధాని అమరావతిలో కీలక అభివృద్ధి పనులు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటినుంచో కొనసాగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పూర్తికావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఈ రహదారిని ప్రారంభించారు. అలాగే రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలకు కూడా శ్రీకారం చుట్టారు.

అమరావతిని కలిపే ప్రధాన రహదారిగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డులో రాయపూడి–వెంకటపాలెం–పెనుమాక–ఉండవల్లి మార్గంలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా సీఎం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మూడో దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి-16కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

మొత్తం రూ.1,519 కోట్ల అంచనా వ్యయంతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో కరకట్టకు ప్రత్యామ్నాయంగా వాహన రాకపోకలకు మార్గం సుగమమైంది. విజయవాడ–మంగళగిరి మార్గంతోనూ సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించడంతో అమరావతికి రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి.

మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ రహదారిని ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉన్న ఎన్-సిరీస్ రహదారులతో అనుసంధానించారు. 1.77 కిలోమీటర్ల మేర నిర్మించిన రోడ్డు 60 మీటర్ల వెడల్పుతో ఉంది. ఇందులో సర్వీస్ రోడ్లు, ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, 9 లైన్ల రహదారితో పాటు సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు.

ఇక బకింగ్‌హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి 110 మీటర్ల పొడవు, 9+9 మీటర్ల వెడల్పుతో ఉంది. కొండవీటి వాగుపై నిర్మించిన మరో స్టీల్ బ్రిడ్జి 284 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ రెండు వంతెనలు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.

సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది. భవిష్యత్‌లో ప్రజా రవాణాకు ఈ రహదారి కీలకంగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...