దేశంలో లక్షల్లో ఏఐ ఉద్యోగాలు- రూ. 80 లక్షల వరకు ప్యాకేజీలతో మోస్ట్ డిమాండ్ జాబ్స్ ఇవే- 6 నెలల ప్లాన్‌తో..!

Date:

 ప్రస్తుత రోజుల్లో ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ విపరీతంగా ఉందన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఇంకా ఏఐ నిపుణులకు తీవ్రమైన కొరత ఉండటంతో కంపెనీలు లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. పైథాన్, మెషీన్ లెర్నింగ్ లేదా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నైపుణ్యాల్ని 6 నెలల రోడ్‌మ్యాప్ ద్వారా నేర్చుకొని ఈ ఉద్యోగాల్ని సులభంగా దక్కించుకోవచ్చని సీఐఐ రిపోర్ట్ పేర్కొంది.

భారత జాబ్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో నిపుణుల కొరత ఏర్పడింది. 2026 చివరికల్లా ఏఐ రంగంలో ఉద్యోగాల డిమాండ్, అభ్యర్థుల సప్లై కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువగా ఉండబోతోంది. దేశీయ మార్కెట్లో దాదాపు 10 లక్షల మంది ఏఐ ఇంజినీర్ల అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం ప్రతి 10 ఉద్యోగాల్లో కేవలం ఒక్కదానికి మాత్రమే సరిపడా అభ్యర్థులు అందుబాటులో ఉన్నారు. అంటే దాదాపు 9 లక్షల ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోనున్నాయి. ఈ విపరీతమైన డిమాండ్ కారణంగా మీకు సరైన నైపుణ్యాలు ఉంటే గనుక కంపెనీలే మీ కోసం వెతుక్కుంటూ వస్తాయి. కేవలం 6 నెలల ప్రిపరేషన్‌తోనే లక్షల రూపాయల ప్యాకేజీలు ఇచ్చే టాప్ 10 ఏఐ ఉద్యోగాలు ఏమేం ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్- ఇక్కడ జీతం ప్యాకేజీ కనీసం రూ. 30 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 80 లక్షల వరకు ఉంది. ఈ రంగంలోనే అత్యధిక ప్యాకేజీ ఇచ్చే విభాగం ఇది. అయితే దీనికి పీహెచ్‌డీ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి.
  • MLOps ఇంజినీర్- ఇక్కడ ప్యాకేజీ రూ. 22- 55 లక్షల మధ్య ఉంది. టోటల్ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లలో కేవలం 5 శాతం మందికి మాత్రమే MLOps తెలుసు. ఒక మోడల్‌ను మిలియన్ల మంది యూజర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా అందించడం వీరి పని. వీరికి కావాల్సిన స్కిల్స్ డాకర్ (Docker), kubernetes, ML Pipelines.
  • మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ (ML Engineer)- వీరి ప్యాకేజీ కూడా రూ. 20- 55 లక్షల వరకు ఉంది. ఫ్రాడ్ డిటెక్షన్, రికమెండేషన్ సిస్టమ్స్ వంటి మోడల్స్‌ను బిల్డ్ చేయడం. ఈ ఫీల్డ్‌లో వీరే కింగ్స్ అని చెబుతుంటారు. ఇక్కడ పైథాన్, పైటార్చ్, టెన్సార్‌ఫ్లో వంటి స్కిల్స్ కావాలి.
  • ఏఐ ప్రొడక్ట్ మేనేజర్- ప్యాకేజీ రూ. 20-50 లక్షల వరకు ఉంది. ఇక్కడ డీప్ కోడింగ్ స్కిల్స్ కూడా అవసరం లేదు. కేవలం ML నాలెడ్జ్, బిజినెస్ జడ్జిమెంట్ ఉంటే చాలు.
  • NLP ఇంజినీర్ (నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్)- ఇక్కడ వార్షిక ప్యాకేజీ రూ. 18- 45 లక్షల వరకు ఉంది. చాట్ బాట్స్, వాయిస్ అసిస్టెంట్లు, ట్రాన్స్‌లేటర్ల టెక్నాలజీని డెవలప్‌ చేయడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...