అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

పలు జిల్లాల్లో వర్ష సూచన

గురువారం తూర్పుగోదావరి, పోలవరం, బాపట్ల, ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం

బుధవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 45.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాకాడులో 32.5, పెన్నేపల్లెలో 30 మి.మీ. వర్షం కురిసింది.

నెల్లూరు జిల్లా అల్లంపాడులో 41.5 మి.మీ., గూడూరులో 32.7, విడవలూరులో 32, మొలకలపుండ్లలో 28, నెల్లూరులో 23.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భీమవరంలోనూ 22.7 మి.మీ. వర్షం కురిసింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *