సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్

Date:

కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు.

ప్రస్తుతం వేసవి కాలం రావడంతో మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. పండ్లలో రారాజు అయిన మామిడి పండు పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మార్కెట్లో బంగారు వర్ణంతో.. చూస్తేనే తినాలనే విధంగా.. నిగనిగలాడే మామిడి పండ్లు.. బండ్లు, దుకాణాల్లో సందడి చేస్తున్నాయి. రకరకాల మామిడి పండ్లు అన్నీ మార్కెట్‌కు రావడంతో మ్యాంగో లవర్స్‌ ఆనందంలో మునిగిపోతున్నారు. అయితే ఇప్పుడు మామిడి పండ్ల ప్రియుల గుండె గుభేల్ మనే వార్త వచ్చింది. కొందరు కాసుల కక్కుర్తి ఉన్న వ్యాపారులు.. మామిడి పండ్లను రసాయనాలతో మగ్గించి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా.. ప్రజలను అప్రమత్తం చేశారు. కల్తీ మామిడి పండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పాలని వెల్లడించారు.

వేసవి రాకతో పండ్లలో రారాజైన మామిడి పండ్లు మార్కెట్‌లో సందడి చేస్తోందని.. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజ‌లు విస్మరించకూడదని సజ్జనార్ అలర్ట్ చేశారు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని.. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ.. పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని సజ్జనార్ ట్వీట్ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...