హైదరాబాద్‌ కంటే అమరావతిలో భూముల ధర ఎక్కువ.. అప్పుడు నా మాట నమ్మినవారు ఇప్పుడు కోటీశ్వరులు: చంద్రబాబు

Date:

వైసీపీ నాశనం చేయాలనుకున్న అమరావతిని తాము శాసనం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారని.. వారిలాగే అమరావతి రైతులు కూడా లాభపడతారని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు వేల ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇవ్వటం ఒక కేస్ స్టడీగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. గతంలో హైదరాబాద్‌లో కంటే అమరావతిలో భూముల విలువ ఎక్కువ ఉండేదని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ భూముల విలువ పెరిగిందని.. కానీ అమరావతిలో భూములు వ్యవసాయ భూములు కావటంతో ఎక్కువ విలువ ఉండేదన్నారు. కృష్ణా డెల్టా కింద నీటిని ఉపయోగించుకుంటూ ఉండటంతో భూములు ఇచ్చే పరిస్థితులలో కూడా లేరన్నారు చంద్రబాబు.

” రాజధాని కోసం పిలుపిస్తే.. 58 రోజులలో, 29 వేల మంది రైతులు.. 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్.. అభివృద్ధిలో రైతుల భాగస్వా్మ్యం.. ప్రపంచంలో ఇదో కేస్ స్టడీ. తమ జీవితాలు బాగుపడతాయని.. హైదరాబాద్ అభివృద్ధి చూసిన నమ్మకంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం 5 వేల ఎకరాలు భూసేకరణ చేశాం. అప్పుడు భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. ఇక్కడ భూములు ఇవ్వండి.. పక్కన కొనుక్కోండి. ఇక్కడ ఎయిర్‌పోర్టు వస్తుంది.. దీంతో మీ భూముల విలువ పెరుగుతుందని చెప్పాం.. చాలా మంది నమ్మారు, ఇప్పుడు బాగుపడ్డారు. ” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...