పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని బీసీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.

వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు 2017లో జీవో జారీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రపంచానికి విలువైన రామాయణ మహాకావ్యాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. రామాయణం భార్యాభర్తల అనుబంధానికి కుటుంబ విలువలకు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.

వాల్మీకి, బోయ సామాజిక వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు కల్పించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని పేర్కొన్నారు. వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ వర్గాల అభ్యున్నతికి కృషి చేశామని తెలిపారు. పెనుకొండలో వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

దివంగత ఎన్టీ రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు అండగా నిలిచారని మంత్రి సవిత అన్నారు. బీసీల అభ్యున్నతే టీడీపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికలు ఏవైనా బీసీలు టీడీపీ, కూటమికి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *