
D news: టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 ఫిబ్రవరి 20తో ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి ఛైర్మన్గా కొనసాగబోనని ఆయన ప్రకటించారు. ఆగస్టు 18న జరిగే AGM నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త నాయకుడిని ముందుగానే ఎంపిక చేసి, అధికార మార్పిడి సజావుగా జరిగేలా బోర్డు చర్యలు తీసుకోవాలని సూచించారు.
2017లో ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ హయాంలో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా కొనుగోలు, విమానయాన విస్తరణ, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కీలకంగా విస్తరించింది.

