Save Punarvika: చిన్నారి పునర్వికకు అండగా నారా లోకేష్ రూ.6 కోట్ల బాధ్యత తనదంటూ

Date:

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. పునర్విక చికిత్స కోసం అవసరమైన ఆరు కోట్ల రూపాయలు సమకూర్చడం తన బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. చిన్నారి పునర్విక చికిత్స కోసం రూ.16 కోట్లు కావాల్సి ఉండగా దాతల నుంచి రూ.10 కోట్లు సమకూరాయని మిగతా మొత్తాన్ని అందించాలని పునర్విక తల్లిదండ్రులు నారా లోకేష్‌ను సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో వీడియోపై స్పందించిన నారా లోకేష్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

పునర్విక చికిత్స కోసం అన్నిరకాలుగా ప్రయత్నించామని.. సోషల్ మీడియా, ఇతర దాతల సహకారంతో రూ. 10 కోట్లు సమకూరాయని పునర్విక తల్లిదండ్రులు వీడియోలో పేర్కొన్నారు. మిగతా రూ.6 కోట్లను సమకూర్చి, చిన్నారిని ఆదుకోవాలని నారా లోకేష్‌ను కోరారు. దీనికి స్పందించిన నారా లోకేష్ మిగతా రూ.6 కోట్లు తన బాధ్యత అంటూ వారికి భరోసా ఇచ్చారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా బదులిచ్చారు. SMA టైప్-1 అనేది అరుదైన, ప్రమాదకరమైన జన్యుపరమైన పరిస్థితి అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇది పిల్లల కండరాలను బలహీనపరుస్తుందని నెమ్మదిగా కదలడానికి, శ్వాస తీసుకోవడానికి, సాధారణంగా జీవించడానికి వీలు లేకుండా చేస్తుందని అన్నారు. ఈ స్థితిలోనూ కర్నూలుకు చెందిన పునర్విక ధైర్యంగా పోరాడుతోందని నారా లోకేష్ అన్నారు.

మరోవైపు సురేష్‌కుమార్ తొలుత విడుదల చేశారు. ఇకపై ఎవరూ కూడా డబ్బులు డొనేట్ చేయవద్దని కోరారు. అయితే అప్పటికి రూ.10 కోట్లు మాత్రమే సమకూరాయని మిగతా మొత్తం కోసం నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దీనిపై ఆయన స్పందించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...