ఓవర్సీస్‌ జాబ్‌ Scam.. భారీ జీతాల పేరుతో యువతకు టోకరా! నిరుద్యోగులే టార్గెట్

Date:

విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించడం అనేది చాలా మంది తెలుగు కుటుంబాల కల. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అయితే ఈ అవకాశాలను కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు..

విజయవాడ, ఆగస్ట్ 5: విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం చాలా మంది తెలుగు కుటుంబాల కలగా మారింది. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కొంతమంది గుర్తింపు పొందిన ఓవర్సీస్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు అనధికారిక ఏజెంట్లను నమ్ముతున్నారు. ఈ ఏజెంట్లు భారీ జీతాలు, మంచి ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, పలువురిని మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక సందర్భాల్లో రిజిస్ట్రేషన్ లేని ఏజెంట్లు నకిలీ ఉద్యోగ ఆఫర్లు చూపించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. చివరకు ఉద్యోగం రాకపోవడంతో బాధితులు విదేశాలకు వెళ్లలేక, కొందరు అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు

విదేశీ ఉద్యోగ మోసాల్లో ఏపీ టాప్

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గణాంకాల ప్రకారం, విదేశీ ఉద్యోగ నియామక మోసాలకు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ధ్రప్రదేశ్‌ 1,495 ఫిర్యాదులు వచ్చాయి. కేరళ రెండో స్థానం, తమిళనాడు మూడో స్థానం, తెలంగాణ 339 ఫిర్యాదులతో నాలుగో స్థానం ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు గుర్తింపు పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల వివరాలను ముందుగా పరిశీలించాలి. అలాగే పాస్‌పోర్ట్, వీసా, ఉద్యోగ ఒప్పందం వంటి ముఖ్యమైన పత్రాలను పూర్తిగా పరిశీలించకుండా ఎలాంటి చెల్లింపులు చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తిని మోసగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్న నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనలు చెబుతున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...