పంచాయతీ నిధులు.. కరెంట్ బిల్లులకే..!

Date:

గ్రామాల్లో వెలుగులు నింపాల్సిన నిధులు విద్యుత్‌ బకాయిల చీకట్లోకి వెళ్లేలా ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధులపై విద్యుత్‌శాఖ కన్ను పడటంతో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 335గ్రామపంచాయతీల్లో అభివృద్ధి స్తంభించే ప్రమాదం పొంచి ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేక, అప్పులు చేసి పనులు చేస్తున్నా. బిల్లుల భారం మా త్రం సర్పంచుల మెడకు చుట్టుకుంటోంది. గ్రామపం చాయ తీలకు కేంద్రప్రభుత్వం పంపిన అభివృద్ధి నిధులు.

ఇప్పుడు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకే సరిపోని దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ, వీధిదీపాల మర మ్మతులు, ఫాగింగ్‌ వంటి అత్యవసరసేవల కోసం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిదులపై విద్యుత్‌శాఖ కన్నేసింది. జిల్లాలోని 335గ్రామ పంచాయతీల్లో స్ట్రీట్‌ లైట్లు, వాటర్‌ వర్క్స్‌, సంబంధించిన విద్యుత్‌బిల్లుల బకాయిలు రూ.2,93,34 కోట్లకు చేరడం గమనార్హం.

ఈ పరిణామం గ్రామపాలనలో తీవ్రఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతున్నది. పంచాయతీల విద్యుత్‌ బిల్లులను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇటీవల ఆదేశాలు జారీ చేయ డంతో గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 52జే ప్రకారం విద్యుత్‌చార్జీల చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తుంది.

మరోవైపు విద్యుత్‌శాఖ అధికారులు జిల్లా పంచాయతీ అధికారులకు లేఖలు రాయడంతో నిధుల ను మళ్లించక తప్పనిపరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా, వైరల్‌జ్వరాల నివారణకు ఫాగింగ్‌, డ్రైయినేజీల శుభ్రత, చెత్తతొలగింపు అత్యంత కీలకం. ఇటువంటి సమయంలో అందుబాటులో ఉన్న నిధులన్నీ విద్యుత్‌బిల్లులకే కేటాయిస్తే ప్రజారోగ్యం అగమ్యగోచరంగా మారు తుందని ప్రజాప్రతి నిధులు ఆందోళన చెందుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...