Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..

Date:

నీట్ (NEET) పరీక్షల నేపథ్యంలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన నిరసనలను కొందరు దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాల కోసం దారి మళ్లించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని పవన్ సూచించారు. అయితే ప్రజాస్వామ్య నిరసన పేరుతో హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలకు తాను మద్దతు ఇస్తానని, కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే, జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా రంగంలో కీలక మార్పులు వస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ‘నేషన్ ఫస్ట్’ భావనతో దేశ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...