Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?

Date:

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. ట్రైలర్‌ను నేడు విడుదల చేయాలని భావించినప్పటికీ, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు.

సోషల్ మీడియాలో స్పందించిన ఆయన.. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసే ప్రణాళికలో భాగంగానే ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల వ్యయంతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.

ట్రైలర్ ఆలస్యమైనప్పటికీ, ప్రపంచ స్థాయి గ్రాండ్ లాంచ్ కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....