రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు పత్తి, మొక్కజొన్నకు ఊపిరి పోశాయి.

Date:

రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు పత్తి, మొక్కజొన్నకు ఊపిరి పోశాయి. మొన్నటి వరకు ఎండ తీవ్రతకు పత్తి, మొక్కజొన్న మొక్కలు వాలిపోయాయి. ఈ వర్షంతో మొక్కలు ప్రాణం పోసుకున్నాయి. వరిని సాగు చేసే రైతులకు వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా పోసిన నార్లు ముదిరిపోతున్నాయి. ఒక సెంటిమీటర్‌ వర్షపాతమే నమోదైంది. ఎక్కడ చూసిన చెరువులు, కుంటల్లో పది శాతం నీళ్లు కూడా చేరలేదు.

అవి పశువులకే సరిపోతాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు డివిజన్‌లో గట్టిగా వర్షం కురిసిన సందర్భాలు లేవు. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖాధికారులు ప్రత్యామ్నాయ పంటలు వైపు రైతులను మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. హుజూరాబాద్‌ డివిజన్‌లో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ చివరి వారంలో కురిసిన ఒకటి రెండు చిన్నపాటి వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మొలకెత్తిన వర్షాలు కరువకపోవడంతో అవి భూమిలోనే పొట్లిపోయాయి. మళ్లీ రైతులు పత్తి విత్తనాలు విత్తారు.

అవి మొలిశాయి. ఈ నెల ప్రారంభం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎండ తీవ్రతకు మొక్కలు వడలిపోయి ఎండు ముఖం పట్టాయి. రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసుకన్నాయి. డివిజన్‌లో హుజూరాబాద్‌, ఇల్లందకుంట, జమ్మికుంట, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్‌ మండలాలున్నాయి. 1.2 లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి అనుకూలంగా భూమి ఉంది. గత ఏడాది 80 వేల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో పత్తి, 10వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. ఈ సారి వర్షాలు కురవకపో వడంతో పొలాలు బీడుగా మారాయి. అనుకూలమైన వర్షాలు కురిస్తేనే వరి నాట్లు పడతాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...