న్యూయార్క్ విమానాశ్రయంలో ప్రమాదం.. రన్ వేపై ట్రక్కును ఢీకొట్టిన విమానం, పలువురికి గాయాలు

Date:

అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయం రన్ వేపై ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. వంద మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం.. రన్ వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. గంటకు 39 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా ట్రక్కును ఢీకొట్టగా.. విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ భీకర ప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బందితో పాటు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లా గార్డియా విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెను ప్రమాదం సంభవించింది. కెనడాలోని మాంట్రియల్ నుంచి ప్రయాణికులతో వచ్చిన ‘ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్’ విమానం.. రన్‌వేపై వేగంగా వెళ్తున్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఫైర్ ఫైటర్లు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. విమాన పైలట్, కో-పైలట్‌లకు కూడా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ‘సీఆర్‌జే-900’ విమానం లాగార్డియా ఎయిర్‌పోర్టులోని నాలుగో రన్‌వేపై దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానం సుమారు గంటకు 24 మైళ్ల (39 కిలో మీటర్ల) వేగంతో ప్రయాణిస్తోంది. రన్‌వేపై ఉన్న ఫైర్ ట్రక్కును ఢీకొట్టడంతో విమానం ముందు భాగం ఒక్కసారిగా పైకి లేచి పూర్తిగా ధ్వంసమైంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...