PM Modi: పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. అలా చేస్తే ఎవ్వరినీ వదలం!

Date:

దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులపై వేగవంతమైన విచారణ జరిపి, దోషులకు త్వరితగతిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ.. దేశ యువత భవిష్యత్తు, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేపర్ లీకేజీలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మోదీ హెచ్చరించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా ఇలాంటి కేసుల్లో త్వరిత విచారణ పూర్తి చేసి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...