
కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొనగా, ఓవర్సీస్ ప్రీమియర్స్ మరియు తొలి షోల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.
బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే బలహీనమైన కథనం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే సినిమాకు మైనస్‌గా మారాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకున్నప్పటికీ, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా చూస్తే, విజయ్ మాస్ ఇమేజ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసిన ‘జన నాయకుడు’ కథ, దర్శకత్వం పరంగా మాత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని తొలి టాక్ వినిపిస్తోంది.

