PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..

Date:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వ్యయ వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రధాని విదేశీ పర్యటనల కోసం మొత్తం రూ.74.5 కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది. ఈ వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్, సీపీఎం ఎంపీ వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.

ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్ 2025 వరకు ప్రధానమంత్రి చేపట్టిన విదేశీ పర్యటనలు, వాటికి అయిన ఖర్చు, ఆయా పర్యటనల సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు (MoUs), అలాగే దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించింది.

ఈ కాలంలో భారత్‌కు 381.8 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే ప్రధానమంత్రి విదేశీ పర్యటనల ద్వారా సాంకేతికత, ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం తదితర కీలక రంగాల్లో అనేక ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. ఈ పర్యటనలతో వివిధ దేశాలతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...