ఎర్రకోటపై నుంచి ‘సప్త ధార’లను ప్రకటించిన ప్రధాని.. 70 ఏళ్లలో సాధించలేనిది.. వచ్చే ఏడేళ్లలో సాధించడమే లక్ష్యం..!

Date:

D news: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రగతికి ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. గత ఐదు నుంచి ఏడు దశాబ్దాల్లో సాధించలేనివాటిని వచ్చే ఐదు నుంచి ఏడు ఏళ్లలో సాధించేలా ఈ ఏడు రంగాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.

యువత ప్రతిభ, శక్తి, ఉత్సాహాన్ని దేశ నిర్మాణానికి పూర్తిస్థాయిలో వినియోగిస్తామని మోదీ చెప్పారు. తయారీ, రైతాంగం, సాంకేతికత, గతిశక్తి, రక్షణ, గ్రీన్‌ ఎనర్జీ, సాఫ్ట్‌ పవర్‌.. ఈ ఏడు ధారలతో భారత్‌ను మరింత బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.

సప్తధారలోని ఏడు అంశాలు

1. తయారీ రంగం: తయారీని దేశ ఆర్థిక వృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌గా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. విడిభాగాల నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తుల వరకు దేశంలోనే తయారు చేసి, ప్రపంచ సప్లయ్‌ చైన్‌లో భారత్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు.

2. రైతాంగం: వ్యవసాయం, ఆహార శుద్ధి రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత సంప్రదాయ ఆహారాలు, మిల్లెట్స్‌, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలను అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలని అన్నారు.

3. టెక్నాలజీ: డేటా సెంటర్లు, రోబోటిక్స్‌, కొత్త తరం టెక్నాలజీలకు భారత్‌ హబ్‌గా మారాలని మోదీ ఆకాంక్షించారు. యూపీఐ, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా విజయాలను ప్రస్తావిస్తూ మేడిన్‌ ఇండియా 6జీ దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

4. గతిశక్తి: దేశవ్యాప్తంగా వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మెరుగైన మౌలిక వసతులతో వ్యాపార రంగానికి మరింత ఊతమివ్వాలని అన్నారు.

5. రక్షణ శక్తి: రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా దేశీయ తయారీని పెంచాలని మోదీ అన్నారు. డ్రోన్లు, కౌంటర్‌ డ్రోన్‌ టెక్నాలజీలపై మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

6. గ్రీన్‌ ఎనర్జీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్‌ టెక్నాలజీల్లో భారీ ఆవిష్కరణలు అవసరమని ప్రధాని చెప్పారు. స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు.

7. సాఫ్ట్‌ పవర్‌: యోగా, చేతివృత్తులు, సినిమా, యానిమేషన్‌, గేమింగ్‌, డిజిటల్‌ కంటెంట్‌, సృజనాత్మక రంగాలను భారత సాఫ్ట్‌ పవర్‌గా మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే సామర్థ్యం భారత్‌కు ఉందని, జాతీయ పార్కులు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేయాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...

ఒంటరి మహిళలే టార్గెట్.. మాటు వేసి చంపేస్తాడు.. రెండేళ్లలో ఇద్దరు!

మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలం డీజీపేటలో జరిగిన మహిళ హత్య కేసును...

ఏపీలో ‘ఈగల్ ఛాలెంజ్’.. గంజాయిని పట్టిస్తే రూ.5వేలు, తాగేవారిని పట్టిస్తే రూ.1,500 ఇస్తారు

విజయవాడలో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ఎన్‌టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు...

భారత్‌లోనే తొలి నాన్‌-జీఎంఓ, అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

https://www.youtube.com/watch?v=kEwBXjvypsY భారత్‌లోనే తొలిసారిగా నాన్‌-జీఎంఓ, అధిక విస్తరణ సామర్థ్యం కలిగిన పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్...