
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 24వ విడత కింద 9.34 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి శుక్రవారం రూ.18,690 కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ జమ చేయనున్నారు. ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ కానున్నాయి.
గుజరాత్లోని బనస్కాంతలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను విడుదల చేయనున్నారు. మధ్యప్రదేశ్లోని రైసన్ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇదే కార్యక్రమంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ – AIF) కింద ఏర్పాటు చేసిన 521 యూనిట్లను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. పీఎం కిసాన్ నిధుల విడుదలతో కోట్లాది మంది రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
