ప్రజల భద్రతే లక్ష్యం.. ఏపీ ఫైర్ సేఫ్టీకి భారీ బూస్ట్!

Date:

అమరావతి: D news:అగ్నిప్రమాదాలను వేగంగా నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం అగ్నిమాపక శాఖను ఆధునిక వాహనాలతో బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.40 కోట్లతో 58 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు.

వీటిలో 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు, 20 వాటర్‌ బౌజర్లు, 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ వాహనాలు ఉన్నాయి.

ఎక్కడ ఉపయోగిస్తారంటే..

గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 25 అధునాతన వాహనాలను వినియోగించనున్నారు. భారీ అగ్నిప్రమాదాల్లో నిరంతర నీటి సరఫరా కోసం 20 వాటర్‌ బౌజర్లు ఉపయోగపడనున్నాయి.

ఇరుకైన వీధులు, రద్దీ ప్రాంతాలకు వేగంగా చేరుకునేందుకు 13 క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి మంటలను త్వరగా అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.

ఇప్పటికే తొలి దశలో రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా వాహనాలతో రాష్ట్రంలో ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...