
ప్రయాణానికి కొన్ని రోజుల ముందే ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ను బుక్ చేసుకున్న ఓ మహిళకు, ఖచ్చితమైన రిజర్వేషన్ ఉన్నప్పటికీ తీవ్ర అవమానం ఎదురైంది. టికెట్ చెల్లుబాటులో ఉన్నప్పటికీ టీటీఈ ఆమెను బలవంతంగా రైలు నుంచి దింపేశారు. అంతేకాకుండా ఆర్‌పీఎఫ్ సిబ్బందితో ఆమెను అరెస్ట్ చేయించారు.
తనకు జరిగిన అన్యాయంపై ఆ మహిళ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై సుదీర్ఘ విచారణ జరిపిన కమిషన్.. టీటీఈ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది వ్యవహరించిన తీరు అనాగరికంగా ఉందని తీవ్రంగా తప్పుబట్టింది. వారి చర్యల వల్ల మహిళ మానసిక క్షోభకు గురయ్యారని పేర్కొంది.
ఈ నేపథ్యంలో బాధిత మహిళకు రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోగా ఆమెకు అందించాలని స్పష్టం చేసింది.
- ఖచ్చితమైన రిజర్వేషన్ టికెట్ ఉన్నప్పటికీ ఓ మహిళా ప్రయాణికురాలిని అర్ధరాత్రి సమయంలో రైలు నుంచి దింపేసి, సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను ఆదేశించింది.కమిషన్ ఛైర్‌పర్సన్ జస్టిస్ అలెగ్జాండర్ థామస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలికి నెల రోజుల్లోగా పరిహారం చెల్లించడంతో పాటు, చెల్లింపు వివరాలను కమిషన్‌కు సమర్పించాలని రైల్వే శాఖను ఆదేశించారు.
- 2023 జూలై 30న జయస్మిత అనే మహిళా ప్రయాణికురాలు వడక్కన్‌చేరి నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ముందుగానే రైలు టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. నిర్ణీత సమయానికి రైలు ఎక్కిన ఆమె, తనకు కేటాయించిన బెర్త్ వద్దకు వెళ్లగా అక్కడ అప్పటికే మరో వ్యక్తి కూర్చొని ఉండటాన్ని గమనించారు.
- దీంతో వెంటనే విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సంప్రదించి పరిస్థితిని వివరించారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన టీటీఈ బాధ్యతాయుతంగా స్పందించకుండా, ఆమె ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్ ఇప్పటికే రద్దయిందంటూ అసహనం వ్యక్తం చేశారు.
