Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

Date:

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

అలాగే నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4 .5 నుండి 5 .8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఇక ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ జారీ చేసింది. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మూడ్రోజుల పాటు వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఇక ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇఖ దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈరోజు ,రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశముందని  అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాల సమయంలో బలమై న గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ సహా 10 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది., కుమురం భీమ్, మేడక్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్‌, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తేలికపాటి వర్షాలకు కురుస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Follow Us

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...