గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ‘పుష్ప 2’ వంటి భారీ విజయం తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

దసరా రోజే గ్రాండ్‌గా ప్రారంభం?

ప్రస్తుతం ‘RC17’ స్క్రిప్ట్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ప్లానింగ్ నెట్టింట వైరల్ అవుతోంది. అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా ఈ మూవీకి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దసరా పండుగ రోజున అధికారికంగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్?

పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఈ ఏడాది డిసెంబర్ నుంచి ‘RC17’ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు మేకర్స్ ప్రత్యేక టైమ్‌లైన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

సుమారు 12 నెలల్లో షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి 2027 డిసెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో సుకుమార్ టీమ్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టాక్. అయితే విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

‘RC17’కు సంగీతం ఎవరు అందించనున్నారనే దానిపై ఇప్పటికే పలు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ సంగీత దర్శకుడి పేరును అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.