
D news: ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిట్ మచ్చార్ ధైర్యసాహసాలపై మాజీ సీఎం వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంపై గగనతలంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల భద్రత కోసం కెప్టెన్ మచ్చార్ వ్యవహరించిన తీరును వారు కొనియాడారు.
ఈ ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రాణాలకు తెగించి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన మచ్చార్ ధైర్యం, త్యాగం, నిస్వార్థ సేవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయనను దేశం గర్వించదగ్గ నిజమైన హీరోగా అభివర్ణిస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కెప్టెన్ మచ్చార్ శౌర్యంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఆయన ధైర్యం వందలాది ప్రాణాలను కాపాడటంతో పాటు పెద్ద విషాదాన్ని నివారించడంలో సహాయపడిందని పేర్కొన్నారు. కెప్టెన్ మచ్చార్ పట్ల భారత్ గర్విస్తోందని తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
