నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు పురపాలక ఎన్నికల్లో 21వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొల్ల సమీరా భాను మరోసారి పోటీ చేస్తున్నారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆమెకు పార్టీ అధిష్ఠానం మరోసారి అవకాశం కల్పించింది.

వార్డు అభివృద్ధే ప్రధాన లక్ష్యం

గతంలో వార్డులో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమీరా భాను తెలిపారు. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టి, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ధారా సుధీర్ నాయకత్వంలో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆమె వెల్లడించారు.

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తనవిగా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇస్తే, 100 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కృషి చేసి 21వ వార్డును పట్టణంలోనే ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తానని సమీరా భాను పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వార్డు ప్రజలు తనకు మరోసారి మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆమె కోరారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *