
అప్పాజీపేటలో అంతుచిక్కని రాళ్ల వర్షం.. భయాందోళనలో గ్రామస్థులు
అనంతపురం జిల్లాలోని అప్పాజీపేట గ్రామంలో వారం రోజులుగా అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంటోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా గాల్లోంచి రాళ్లు పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాళ్లు ఎలా పడుతున్నాయో, వాటిని ఎవరు విసురుతున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసిన సమయంలోనూ రాళ్లు పడటంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. దీంతో కొందరు గ్రామస్థులు ఇది దెయ్యం లేదా అతీంద్రియ శక్తుల పని అయి ఉండొచ్చని అనుమానిస్తూ స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు.
అయితే రాళ్లు పడుతున్న తీరు వెనుక ఆకతాయిల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు కారణమేంటో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాళ్ల ఘటనతో రాత్రివేళ బయటకు రావడానికి కూడా భయపడుతున్నామని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ సమస్యకు పోలీసులు త్వరగా పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
రాత్రయితే చాలు వణికిపోతున్న గ్రామస్తులు
అనంతపురం జిల్లాలోని అప్పాజీపేట గ్రామంలో వారం రోజులుగా చోటుచేసుకుంటున్న ఓ వింత ఘటన ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు.. కానీ అకస్మాత్తుగా గాల్లోంచి రాళ్లు ఇళ్లపైకి వచ్చి పడుతున్నాయి. రాత్రి సమయాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇప్పటికే రాళ్లు పడటంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల పైకప్పులు పగిలిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు విసురుతున్నారో తెలియక గ్రామస్తులు అయోమయంలో పడిపోయారు. రాత్రి వేళల్లో ఇళ్లలో ఉండేందుకు భయపడుతున్న ప్రజలు.. అందరూ ఒకే చోటకు చేరుకుని గడుపుతున్నారు.
ఈ ఘటనపై గ్రామంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరైనా కావాలనే రాళ్లు విసురుతున్నారా? లేక మరేదైనా కారణమా? దైవశక్తి, దెయ్యం అంటూ కొందరు భిన్నమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భయంతో చివరకు గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు సిబ్బందితో గ్రామంలో గస్తీ నిర్వహించారు. అయితే పోలీసులు అక్కడే ఉన్న సమయంలోనూ ఇళ్లపైకి రాళ్లు వచ్చి పడటంతో ఈ ఘటన మరింత మిస్టరీగా మారింది.
మరోవైపు ఈ వింత ఘటనకు కారణం ఏమిటో తెలుసుకునేందుకు సుమారు 20 మంది యువకులు కూడా రంగంలోకి దిగారు. పోలీసులతో కలిసి సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయినప్పటికీ రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై ఎలాంటి ఆధారం లభించలేదు. వారు కొండపై పరిశీలిస్తున్న సమయంలోనూ గ్రామంలోని ఇళ్లపై రాళ్లు పడ్డాయి.
రాళ్ల వర్షానికి అసలు కారణమేంటన్నది అంతుచిక్కకపోవడంతో గ్రామస్తుల భయం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అసలు నిజాన్ని వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
