
తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించడంతోపాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వర్ష సూచన జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించడంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ దశలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పాటు ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణతో పాటు మధ్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని అంచనా వేశారు.
ఆకాశం మేఘావృతం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అయితే, వర్షాలు కురిసే సమయాల మధ్య విరామాల్లో కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగవచ్చని పేర్కొన్నారు. వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 15వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. వీటితో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
అక్టోబర్ 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు కొన్ని జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
