ఈ తాత మామూలోడు కాదు.. 72 ఏళ్ల వయస్సులో సాహసం.. 5642 మీటర్ల మంచు శిఖరం అధిరోహణ!

Date:

వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించారు విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు. 72 ఏళ్ల వయసులో యూరప్‌లోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌ శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 5,642 మీటర్ల ఎత్తైన ఈ మంచు శిఖరాన్ని ఆగస్టు 14న తన 17 ఏళ్ల మనవడు పోకూరి అనురాగ్‌తో కలిసి అధిరోహించారు.

తాతా, మనవడు కలిసి ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌తో పాటు ఈస్ట్‌ పీక్‌ను కూడా అధిరోహించడం విశేషం. ఈ సాహసయాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో రవీంద్రరావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

72 ఏళ్ల వయసులోనూ మంచు పర్వతాన్ని అధిరోహించేంత ఫిట్‌నెస్‌ కొనసాగించడం అందరినీ ఆకట్టుకుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే వయసుతో సంబంధం లేకుండా సాహసాలు చేయవచ్చని రవీంద్రరావు నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు.

మరో విశేషం ఏమిటంటే.. అనురాగ్‌ ప్రముఖ నిర్మాత, ఈతరం ఫిల్మ్‌ అధినేత పోకూరి బాబూరావు మనవడు. తాత, మనవడు కలిసి చేపట్టిన ఈ సాహసయాత్ర పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...