
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా మెలిగిన అనంతరం, మూడు సార్లు అబార్షన్లు చేయించాడని యువతి పేర్కొంది.
తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ప్రస్తుతం మాట మార్చి మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని యువతికి సంఘీభావం తెలిపారు.
ఇప్పటికే ఈ విషయంపై ఎమ్మెల్యేను ఆశ్రయించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.
ప్రేమ పేరుతో మోసం చేశారంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ తనను ప్రేమిస్తున్నానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించింది.
శ్రీకాంత్ తనతో సన్నిహితంగా మెలిగిన సమయంలో శారీరకంగా లోబరుచుకున్నాడని, ఆ సమయంలో మూడు సార్లు అబార్షన్లు చేయించాడని యువతి ఆరోపించింది. అనంతరం పెళ్లి విషయంలో మాట మార్చి తనను మోసం చేశాడని పేర్కొంది.
ఈ సమస్యపై పలుమార్లు న్యాయం కోసం ప్రయత్నించినప్పటికీ పరిష్కారం లభించలేదని యువతి తెలిపింది. దీంతో నేరుగా మున్సిపల్ ఛైర్మన్ ఇంటి వద్దకు వచ్చి నిరసన చేపట్టినట్లు వెల్లడించింది. తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆందోళన కొనసాగించింది.
“పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్‌తో నాకు మూడేళ్లుగా ప్రేమ సంబంధం ఉంది. పెళ్లి చేసుకుంటానని ఆయన చెప్పడంతోనే నేను ఆ సంబంధాన్ని కొనసాగించాను. తన కుటుంబ సభ్యులతో కూడా నాకు పరిచయం చేయించాడు. గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆయన సోదరి తదితర కుటుంబ సభ్యులు కూడా నన్ను ‘వదినా’ అని పిలిచేవారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించిన తర్వాత శ్రీకాంత్ నాతో శారీరకంగా సన్నిహితంగా మెలిగాడు. తన స్నేహితుల సమక్షంలో అబార్షన్ పిల్స్ కూడా వేయించారని యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, ప్రస్తుతం పిల్స్ వేసుకోవాలని శ్రీకాంత్‌తో పాటు అతడి స్నేహితులు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.
శ్రీకాంత్ తండ్రి మున్సిపల్ ఛైర్మన్ అయిన తర్వాత శ్రీకాంత్ తనతో సరిగ్గా మాట్లాడటం లేదని ఆమె తెలిపింది. ఈ విషయంపై ఛైర్మన్‌ను కలిసి తన వద్ద ఉన్న ఆధారాలను చూపించినప్పటికీ స్పందన రాలేదని ఆరోపించింది. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిసి తన సమస్యను వివరించానని, శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించినప్పటికీ అతడు తన మాట వినలేదని చెప్పింది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకాంత్ పెళ్లికి అంగీకరించడం లేదని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే తాను నమ్మానని, కానీ చివరకు ఇలా మోసం చేస్తాడని ఊహించలేదని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.”
