అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి

Date:

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Gottipati Ravikumar) వ్యాఖ్యానించారు. ఈరోజు (గురువారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధికి రైతుల త్యాగమే కారణమని పేర్కొన్నారు.

భూములు ఇచ్చిన రైతుల త్యాగాలతోనే అమరావతి నిర్మాణం ఇంత పెద్దఎత్తున జరుగుతోందని వెల్లడించారు. జగన్ హయాంలో అసెంబ్లీలో 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా రాజధాని ఉండాలని మద్దతు ఇచ్చారని తెలిపారు. ఆ ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో అయోమయం సృష్టించారని ఆగ్రహించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ వచ్చి చూడాలని హితవు పలికారు.

ఎడ్యుకేషన్ హబ్‌గా అమరావతి మారుతుందని చెప్పుకొచ్చారు. SRM, VIT, BITS పిలానీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఇక్కడకు వస్తున్నాయని వెల్లడించారు. త్వరలోనే స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, కళాశాల కూడా రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, టెక్, సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించిన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...