సిద్దిపేట జిల్లాలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బలి.. నలుగురికి గాయాలు!

Date:

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారును లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే, హుస్నాబాద్ మండలం పందిళ్ళ వంతెన సమీపంలో జరిగింది. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గంగం శ్రీధర్ రెడ్డి (40) తన భార్య దివ్య తేజ (32), కుమారుడు నిహాన్ రెడ్డి (11), కుమార్తె శ్రీనిక (6)లతో కలిసి హైదరాబాద్ నుండి స్వగ్రామానికి కారులో బయలుదేరారు.

పందిళ్ళ వంతెన వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలు కాగా, భార్య దివ్య తేజ, కుమారుడు నిహాన్ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సిద్దిపేట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....