• విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆహ్వానించారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీలు కేశినేని చిన్ని, హరీశ్ బాలయోగి కలిసి కేంద్ర మంత్రిని స్వయంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానం అందించారు.
  • ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడంతో పాటు నగర సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్-2.0ను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
  • దసరా నవరాత్రి వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవ్-2.0లో కేంద్ర మంత్రి భాగస్వామ్యం కావాలని వారు ఆత్మీయంగా ఆహ్వానించారు. నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను ప్రతిబింబించేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

By Rajini