
విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యార్థుల నిరసనలకు దారితీసే అవకాశం ఉన్న ఆదేశాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు విద్యార్థులు దూరంగా ఉండేలా చూడాలని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు కళాశాల విద్యా డైరెక్టరేట్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విమర్శలకు స్పందిస్తూ సదరు ఆదేశాలను ఉపసంహరించుకుని యూటర్న్ తీసుకుంది.
తమిళనాడులో విద్యార్థులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని జారీ చేసిన ఆదేశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆగస్టు 17న తమిళనాడు కాలేజీ విద్యాశాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వులను తాజాగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో విద్యార్థుల నిరసనల విషయంలో విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఒక్కరోజులోనే మారడం రాజకీయంగా, విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కళాశాల విద్యా డైరెక్టరేట్ (డీసీఈ) ఆగస్టు 17న ఆదేశాలు జారీ చేసింది. వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.
అయితే ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. విమర్శల నేపథ్యంలో ఆగస్టు 17న జారీ చేసిన ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకోవడంతో విజయ్ సర్కార్ నిర్ణయం మారడం తీవ్ర చర్చకు దారితీసింది.
విద్యార్థులు, యువత నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా చూడటాన్ని అత్యవసర అంశంగా పరిగణించాలని, ఆయా కళాశాలలు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
అయితే, విద్యార్థుల నిరసన హక్కును అడ్డుకునేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థులకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, శాంతియుత నిరసనల్లో పాల్గొనకుండా వారిని నిరోధించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థి దశలో తాను కూడా చురుకైన కార్యకలాపాల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థులకు నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్న అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటూ మంగళవారం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కొలీజియేట్ ఎడ్యుకేషన్ సింథియా సెల్వి పి. జారీ చేసిన ఉత్తర్వుల్లో, ఆగస్టు 17న పంపిన కమ్యూనికేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సమాచారం అందించారు.

