ఏపీలో విజయవాడ దుర్గమ్మ ఆలయం టాప్.. వరుసగా రెండు నెలలు, రెండో స్థానంలో ఆ ఆలయం!

Date:

ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న ర్యాంకింగ్స్‌లో విజయవాడ దుర్గ గుడి ప్రథమ స్థానంలో నిలిచింది. భక్తులకు కల్పిస్తున్న సేవల విషయంలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు.. ర్యాంకింగ్స్ కూడా ఇస్తున్నారు. జులై, ఆగస్టు నెలల్లో దుర్గమ్మ ఆలయం టాప్‌లో నిలిచింది. జులైలో 74శాతం.. ఆగస్టులో 1.3శాతం పెరిగి 75.3కు చేరింది. ఆలయాల్లో దర్శనం, ప్రసాదాల నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అంశాలపై అభిప్రాయలు తీసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లో అందుతున్న సేవలపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు మొదటి వారంలో విజయవాడ దుర్గగుడికి ప్రథమ స్థానం దక్కింది. దుర్గమ్మ ఆలయంలో 75.3 శాతం సేవలు బాగున్నాయని అభిప్రాయాన్ని తెలియజేశారు. జులైలో 74శాతం ఉండగా.. ఆగస్టులో 1.3శాతం పెరిగింది. ఆ తర్వాత ద్వారకా తిరుమల 72.4 నుంచి 71.4కు తగ్గింది.. అన్నవరం ఆలయంలో 69.9 నుంచి 69శాతం. శ్రీశైలం 68.0 నుంచి 67.0, కాణిపాకం 69.9 నుంచి 67.8.. శ్రీకాళహస్తి ఆలయంలో 69.4 నుంచి 69.2శాతం.. సింహాచలం 69.7 నుంచి 67.3శాతంకు చేరింది. ప్రతి నెలా దేవాదాయశాఖలోని ప్రధాన ఆలయాల్లో దర్శనం, ప్రసాదాల నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతులపై భక్తుల అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు.

విజయవాడ దుర్గమ్మ ఆలయం గత రెండు నెలలుగా ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. గతంలో ఆరోస్థానంలో ఉంది.. ఆ తర్వాత నుంచి భక్తుల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌ మేరకు సేవల్ని మెరుగుపరిచారు. ఇప్పుడు ఆలయంలో సేవలపై భక్తులు ఆనందంలో ఉన్నారు.. ఆలయానికి మొదటి స్థానం దక్కింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఆలయాలకు వచ్చే భక్తుల నుంచి అక్కడి సేవలపై ఫీడ్‌బ్యాంక్ తీసుకుంటున్నారు. దర్శనం సంతృప్తిగా జరిగిందా? ప్రసాదం, అన్నదానం, రుచి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతులపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

విజయవాడ దుర్గమ్మ ఆలయంతో పాటుగా సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం సహా పధ్రాన ఆలయాల్లో అందించే సేవల గురించి భక్తుల నుంచి అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నారు. ప్రతి నెలా సేవలు ఎలా ఉన్నాయనే ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటునన్నారు. ప్రతినెలా 5 నుంచి మరుసటి నెల ఐదో తేదీ వరకూ తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తున్నారు. జులై, ఆగస్టులో దుర్గమ్మ ఆలయానికి మొదటి స్థానం కాగా.. శ్రీశైలం 2, అన్నవరం 3 స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలోని ఆయా ఆలయాలకు ప్రతి రోజూ దర్శనం కోసం వచ్చే భక్తుల ఫోన్‌ నంబర్లకు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటున్నారు అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...