
విశాఖపట్నంలో జరగనున్న CII పార్టనర్షిప్ సమ్మిట్-2026 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సదస్సులో చర్చించాల్సిన అంశాలు ప్రతిపాదిత డిక్లరేషన్లపై CII ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సీఎం చర్చించారు.
విశాఖ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. విధాన రూపకర్తలు పెట్టుబడిదారులు పారిశ్రామిక సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లను ఒకే వేదికపైకి తీసుకురావాలని చంద్రబాబు పేర్కొన్నారు.
సదస్సులో జరిగే చర్చలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా వ్యాపార సాంకేతిక భాగస్వామ్యాలుగా మార్చాలని సూచించారు. ప్రపంచ మార్కెట్లతో రాష్ట్రంలోని పరిశ్రమలను అనుసంధానించడం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) కొత్త వ్యాపార అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలన్నారు.
సాంకేతిక సహకారాన్ని విస్తరించడంతో పాటు యువత నైపుణ్యాలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించే దిశగా సదస్సు నిర్వహించాలని సీఎం సూచించారు. ఎస్క్రో అకౌంట్ విధానం ద్వారా పారిశ్రామిక రాయితీల చెల్లింపులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలను ప్రపంచ పారిశ్రామిక వర్గాలకు పరిచయం చేయాలన్నారు.
గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, సెమీకండక్టర్ల వంటి కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యుత్తమ విధానాలు నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆధునిక మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్, బలమైన నాయకత్వం రాష్ట్రానికి ప్రధాన బలాలని వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం సురక్షితం సులభతరం అనే విశ్వాసాన్ని పారిశ్రామికవేత్తల్లో కల్పించాలని స్పష్టం చేశారు.
