జీవితాంతం రుణపడి ఉంటాం సార్‌…

Date:

నిషేదిత 22ఏ జాబితా నుంచి భూములకు విముక్తి కల్పించినందుకు ఆవులపల్లె రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. సోమవారం రాత్రి అమరావతిలో వీరు సీఎంను కలిశారు. 22ఏ నుంచి 911.74 ఎకరాల భూములకు విముక్తి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం నుంచి అందుకుని ఆనందం వ్యక్తం చేశారు.

సీతమ్మ చెరువు కట్టపై ఆవులపల్లె బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించి మూడుపంటలు పండే వేలాది ఎకరాలు నీటిముంపునకు గురిచేసి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని బాధిత రైతులు సీఎంకు వివరించారు. అక్రమ కేసులు పెట్టారని, 1బీ రాకుండా రెవెన్యూ రికార్డుల తారుమారు చేయించి వేధించారన్నారు. ఈక్రమంలో కూటమి ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసిందన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో సీతమ్మ చెరువు కట్టను తెంచేసి రిజర్వాయర్‌ కట్టాలనుకోవడంతో ఇప్పటికి నాలుగు మార్లు వర్షాలు పడినా నీరు నిల్వలేదు. కాగా రూ.19.73 కోట్లతో ఈ చెరువుకట్ట పునరుద్ధరణ పనుల ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి జలవనరులశాఖకు పంపారని రైతులు చెప్పారు. ఈసందర్భంగా ఆవులపల్లె రైతులు లక్ష్మీపతి నాయుడు, తదితరులు మాట్లాడుతూ సీతమ్మ చెరువుతో పాటు తమ భూములు మళ్లీ పూర్వస్థితికి వస్తుండటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...