Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

Date:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పగటిపుట ఉష్ణోగ్రతలు ఏకంగా ఐదు డిగ్రీలు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకే అత్యధిక ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఖమ్మం భద్రాచలం మినహా మిగతా జిల్లాలన్నీ 40 లోపే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. భద్రాచలంలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాదులో స్వల్పంగా 36. 8 డిగ్రీలకే పగటిపూట ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి. మరోపక్క నిన్న ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ మార్పులవల్ల గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...