రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ వెంటాడిన మృత్యువు.. అరుదైన వ్యాధితో తెలంగాణ బిడ్డ మృతి!

Date:

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణకు చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నిత్యానంద్ రెడ్డి గన్ను (నందు) జూలై 18న అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం, ఆన్ ఆర్బర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మెదడుకు సంబంధించిన అరుదైన సమస్య తలెత్తడంతో జూలై 22న ఆయన కన్నుమూశారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణకు చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నిత్యానంద్ రెడ్డి గన్ను (నందు) జూలై 18న అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం, ఆన్ ఆర్బర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మెదడుకు సంబంధించిన అరుదైన సమస్య తలెత్తడంతో జూలై 22న ఆయన కన్నుమూశారు.

నిత్యానంద్ రెడ్డి 2024లో ఇండియానా టెక్ యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. మిచిగాన్ రాష్ట్రం ఆన్ ఆర్బర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర ఫ్రాక్చర్లు సహా పలు గాయాలు కావడంతో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతమై కోలుకుంటారని కుటుంబ సభ్యులు ఆశించినప్పటికీ, అనంతరం ఆయనకు సెరెబ్రల్ ఫ్యాట్ ఎంబోలిజం అనే అత్యంత అరుదైన, ప్రాణాంతక సమస్య సోకింది. విరిగిన ఎముకల నుంచి విడుదలైన కొవ్వు కణాలు రక్తప్రవాహం ద్వారా మెదడుకు చేరింది. దీంతో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఏర్పడటంతో ఆయన ఆరోగ్యం విషమించింది.

వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ నిత్యానంద్‌ను కాపాడలేకపోయారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పాటు చేసిన GoFundMe ప్రచారం ద్వారా ఐసీయూ చికిత్స, ఆరోగ్య బీమా పరిధిలోకి రాని వైద్య ఖర్చులు, అలాగే మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఖర్చుల కోసం విరాళాలు సేకరించారు. జూలై 26 నాటికి ఈ ప్రచారం ద్వారా 67 వేల డాలర్లకు పైగా, అంటే సుమారు రూ.64.7 లక్షలు సమీకరించబడినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

నిత్యానంద్ ఆకస్మిక మరణం ఆయన కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. విదేశాల్లో ఉన్న తెలుగు విద్యార్థులు, ప్రవాస భారతీయులు కూడా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ ఘటన విదేశాల్లో చదువుతున్న, ఉద్యోగాలు చేస్తున్న యువత భద్రతపై మరోసారి ఆందోళనలను వ్యక్తం చేస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...