కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణం.. రికార్డుల మోత మోగించిన మీరాబాయి చాను..!

Date:

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకంతో దేశానికి తొలి పసిడి అందించింది. స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కేజీలు కలిపి మొత్తం 190 కేజీల బరువునెత్తి రికార్డు సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని మీరాబాయి స్వర్ణ పతకం సాధించింది.

కామన్వెల్త్ గేమ్స్ 2026 వేదికగా భారత వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్లాస్గోలోని ఎస్‌ఈసీ అర్మాడిల్లో మైదానంలో జరిగిన మహిళల 48 కేజీల ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మీరాబాయి, భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మొత్తం 190 కేజీల బరువునెత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా కామన్‌వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి మహిళా వెయిట్ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది.

ఈ పోరులో మీరాబాయి ఆరంభం కొద్దిగా నిరాశపరిచింది. స్నాచ్ విభాగంలో మొదటి ప్రయత్నంలో 82 కేజీలు ఎత్తలేక బ్యాలెన్స్ కోల్పోయింది. అయితే రెండో ప్రయత్నంలో 82 కేజీలు సులువుగా లేపిన మీరాబాయి, మూడో ప్రయత్నంలో ఏకంగా 85 కేజీలు ఎత్తి స్నాచ్‌లోనే కొత్త కామన్వెల్త్ రికార్డు నమోదు చేసింది. దీంతో ప్రారంభంలోనే ప్రత్యర్థుల కంటే 8 కేజీల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అనంతరం జరిగిన క్లీన్ అండ్ జెర్క్ విభాగంలోనూ తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ, రెండో ప్రయత్నంలో 105 కేజీలు ఎత్తి విజయాన్ని ఖాయం చేసుకుంది. రజత పతకం సాధించిన నైజీరియా లిఫ్టర్ రూత్ అసుకో కంటే ఏకంగా 22 కేజీల ఆధిక్యంతో మీరాబాయి అగ్రస్థానంలో నిలిచింది. త్వరలో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో, స్వర్ణం ఖాయం కావడంతో మీరాబాయి మూడో ప్రయత్నానికి దూరంగా ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...