హనుమాన్ శోభాయాత్రలతో మార్మోగనున్న హైదరాబాద్.. 168 ర్యాలీలకు ఏర్పాట్లు పూర్తి

Date:

హనుమాన్ జయంతి: హైదరాబాద్‌లో హై అలర్ట్.. 168 శోభాయాత్రలకు కట్టుదిట్టమైన బందోబస్తు

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరం మొత్తం భక్తి వాతావరణంలో మునిగిపోనుంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్రల దృష్ట్యా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నగరవ్యాప్తంగా మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.

ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో హైదరాబాద్ మార్మోగనుంది. భారీగా భక్తులు పాల్గొనే అవకాశముండటంతో నిర్వాహకులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శోభాయాత్రలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

మంగళవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, శోభాయాత్ర నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రధాన శోభాయాత్రలో దాదాపు 168 ర్యాలీలు కలిసే అవకాశముందని, ఎలాంటి అల్లర్లు జరగకుండా సుమారు 3 వేల మంది పోలీసులతో విస్తృత నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

శోభాయాత్ర నిర్వహణలో పాల్గొనే వాలంటీర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, రోప్ పార్టీ సభ్యులను సమృద్ధిగా నియమించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ముఖ్యంగా ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే డైవర్షన్‌లు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో రెచ్చగొట్టే పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సమావేశం అనంతరం గౌలిగూడ రామమందిరాన్ని సందర్శించిన సీపీ సజ్జనార్, అక్కడి నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ఉన్న సుమారు 12 కిలోమీటర్ల ప్రధాన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా, శోభాయాత్ర మార్గాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లను శుభ్రపరిచి, చెత్త, మట్టికుప్పలు, రాళ్లను తొలగించారు. అలాగే రోడ్డుపైకి వంగి ఉన్న చెట్ల కొమ్మలను కూడా తొలగించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....