ఏందయ్యా ఇదీ..! Google మ్యాప్‌ను నమ్మితే.. నేరుగా గోతిలో పడ్డ కారు

Date:

గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ప్రయాణించిన ఓ కారు వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. తిరుపతి జిల్లాలో లింగసముద్రం వద్ద రహదారి డైవర్షన్ చేసినప్పటికీ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ నేరుగా గోతిలోకి వెళ్లాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా, స్థానికులు అతడిని రక్షించి చికిత్స కోసం తరలించారు..

తిరుపతి, జులై 20: తిరుపతి జిల్లాలో గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ప్రయాణించిన ఓ కారు.. వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు గాయాలు కాగా వాహనం తీవ్రంగా దెబ్బతింది. వివరాల ప్రకారం..

తిరుపతి జిల్లాలో వెంకటగిరి నుంచి డక్కిలి వైపు ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తున్నాడు. ఏర్పేడు–పెంచలకోన జాతీయ రహదారిలోని లింగసముద్రం వద్ద వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా అక్కడ రహదారిని మళ్లించి డైవర్షన్ ఏర్పాటు చేశారు. అయితే డ్రైవర్ గూగుల్ జీపీఎస్‌ను ఆధారంగా చేసుకుని ప్రయాణిస్తుండగా, మ్యాప్ చూపించిన మార్గంలోనే నేరుగా వెళ్లాడు. ముందున్న రహదారి పరిస్థితిని గమనించకపోవడంతో వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలోకి కారు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స కోసం తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు డైవర్షన్‌కు సంబంధించిన హెచ్చరిక బోర్డులు లేదా సూచికలు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....