గుడివాడ బస్టాండ్‌కు రూ.3 కోట్లు విరాళం.. ఈ భార్యాభర్తలది ఎంత గొప్ప మనసు

Date:

గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రముఖ దాతలు అన్నే నరసింహారావు – పుష్ప లీలావతి దంపతులు రూ.3 కోట్ల విరాళ చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. W దంపతులు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం కూడా రూ.3 కోట్ల విరాళం అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. వీరి గొప్ప మనసుకు అందరూ ప్రశంసిస్తున్నారు. గుడివాడ అభివృద్ధిలో వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయంటున్నారు.

పుట్టిన ఊరిలో ప్రజల కోసం ప్రముఖ వ్యాపారి భారీ విరాళం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ప్రముఖ వ్యాపారి అన్నే నరసింహారావు , భార్య పుష్పలీలావతి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజలకు ఉపయోగపడేలా భారీ విరాళాలు అందజేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. గతంలో గుడివాడలోని ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.3 కోట్ల సాయం అందించిన సంగతి తెలిసిందే.. అందుక ‘అన్నే పుష్పలీలావతి అండ్‌ అన్నే నరసింహారావు ఏరియా ఆసుపత్రి తాజాగా గుడివాడ బస్టాండ్‌ అభివృద్ధికి విరాళాన్ని ఇచ్చారు.

ప్రస్తుతం గుడివాడ బస్టాండ్‌కు కూడా రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ చెక్కును అందజేశారు. దాతలు వృద్ధులు కావడంతో వారి తరఫున తుమ్మల రాంప్రసాద్‌ రూ.3 కోట్ల చెక్కును చంద్రబాబుకు ఇచ్చారు.. అలాగే బస్టాండ్‌కు కూడా అన్నే నరసింహారావు, పుష్పలీలావతి పేరు పెట్టాలని కోరారు. అన్నే నరసింహారావు వయసు వయసు 92 ఏళ్లు కాగా.. గుడివాడలోని బాలాజీ సినిమా థియేటర్‌ యజమాని. నరిసింహారావు సొంత ఊరు మాత్రంకైకలూరు నియోజకవర్గం పరిధిలోని సీతనపల్లి. ఆయన సినిమా థియేటర్‌ కోసం గుడివాడకు వచ్చి స్థిరపడగా.. ఈ దంపతలుకు పిల్లల్లేరు. అలాగే నరసింహారావు గతంలో చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారం కూడా చేశారు. నరసింహారావు దగ్గరకు ఎవరైనా వచ్చి సాయం అడిగితే కాదనకుండా చేస్తారనే పేరు కూడా ఉంది. అందుకే ఆయన గుడివాడలో అభివృద్ధి పనులకు తనవంతుగా సాయం అందిస్తున్నారు.

మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మనుమడు నిర్వాన్ గణేష్ తన కిడ్డీ బ్యాంక్ పొదుపు నిధులను ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే శ్రీనివాసరావు కోడలు సాయి శ్వేత రెండు బంగారు గాజులను విరాళంగా సమర్పించారు. దాతలైన అన్నే దంపతులు, యలవర్తి కుటుంబ సభ్యుల సేవా భావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...