New Study: తక్కువ తీసుకుంటున్నామని సంబంర పడకండి.. ఈ అలవాటే ఆ డేంజర్ వ్యాధికి పునాది!

Date:

మీరు ఎక్కువగా చక్కెరతో తయారు చేసిన స్వీట్స్ తింటున్నారా? పోనీ షుగర్ డ్రింక్స్ తాగుతున్నారా? జాగ్రత్త! త్వరలోనే మీరు డేంజర్ వ్యాధి బారిన పడబోతున్నారు. ఆ వ్యాధి డయాబెటిస్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఈ వ్యాధి అంతకంటే డేంజర్.. అవును, ఈ స్వీటెనర్ల వల్ల వచ్చే వ్యాధి ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఈ తాజా సర్వే గురించి తెలుసుకోవాలి.

ఎక్కువగా చక్కెర లేదా వాటి ప్రత్యామ్నాయాలు తీసుకోవడం వల్ల మీరు డయాబెటిస్‌కు మించిన డేంజర్ వ్యాధి బారిన పడే చాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎక్కువ స్వీట్స్, అది కూడా షుగర్‌తో తయారు చేసినవి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గడం, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గి, మతిమరుపు రావడానికి అవకాశాలు ఉన్నాయని తేలింది. స్వీటెనర్లలో తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ.. ఇవి దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో పరిశోధకురాలు డాక్టర్ క్లాడియా కిమీ సుమోటో తెలిపారు.

పరిశోధన ప్రకారం.. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు అస్పార్టేమ్, సాకరిన్, ఎసిసల్ఫేమ్ కె, ఎరిత్రిటాల్, జైలిటాల్, సోర్బిటాల్, టాగటోస్ వంటి ఏడు రకాల తక్కువ క్యాలరీలు కలిగిన స్వీటెనర్లను వాడిన సుమారు 13,000 మంది పెద్దల డేటాను పరిశీలించారు. అయితే ఎక్కువ మొత్తంలో ఈ స్వీటెనర్లను తీసుకున్న వారిలో మెదడు పనితీరు తగ్గే వేగం 62 శాతం ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఓ మోతాదులో స్వీటెనర్లను తీసుకున్న వారిలో మెదడు పనితీరు తగ్గుదల వేగం 35 శాతం ఉన్నట్టు తేలింది.

డయాబెటిస్‌తో బాధపడే చాలా మంది షుగర్ తీసుకుంటే ఇంకా ప్రమాదమని.. ఇలాంటి తక్కువ క్యాలరీలు కలిగిన స్వీటెనర్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ వయసుతో సంబంధం లేకుండా ఇవి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...