గుండె ఆరోగ్యానికి + బరువు తగ్గడానికి+ జీర్ణక్రియకు సులభమైన ఇంటి చిట్కా, అదేనండీ ఒక కప్పు యాలకుల టీ

Date:

వర్షాలు మొదలయ్యాయంటే వేడి వేడి టీ తాగాలనిపించడం సహజమే. అయితే సాధారణ టీకి బదులుగా ఒక యాలకును జోడిస్తే రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో ఉండే సహజ సమ్మేళనాలు జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడం, జలుబు, దగ్గు, గొంతుకు ఉపశమనం కలిగించడం, నోటికి తాజాదనాన్ని అందించడం వంటి ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో యాలకుల టీ ఉపయోగాలతో పాటు, దీనిని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

వర్షాకాలంలో చాలామందికి అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. యాలకుల్లో ఉండే సహజ సమ్మేళనాలు జీర్ణరసాల విడుదలకు మద్దతు ఇచ్చి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా సహాయపడతాయి. భోజనం తర్వాత గోరువెచ్చని యాలకుల టీ తాగితే కడుపు తేలికగా అనిపిస్తుంది

యాలకుల్లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫీనాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. యాలకులలో పష్కలంగా యాంటీఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఈ కాలంలో వచ్చే అనారోగ్యాల నుండి మీ శరీరాన్ని కాపాడటానికి సహాయపడతాయి. వర్షాకాలంలో రోజు యాలకుల టీ తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...