ఏపీలో ఈవీ వాహనాలు కొనుగోలు చేసినవారికి సూపర్ న్యూస్.. కొత్తగా 500 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘సర్వోటెక్‌’ సంస్థ ఈ విషయంలో కీలక పాత్ర పోషించనుంది. పెట్రోల్ బంకులు, హోటళ్లలో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు రానున్నాయి. కొత్తగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇటీవలి కాలంలో ఈవీ వాహనాల కొనుగోళ్లు కూడా పెరిగాయి. అయితే ఈవీ వాహనాలను ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.. నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నెడ్‌క్యాప్ (NEDCAP) నిర్ణయించింది. ఈ ప్రణాళికలకు అనుగుణంగా ఢిల్లీకి చెందిన ‘సర్వోటెక్‌’ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థ పెట్రోల్ బంకులు, స్టార్ హోటళ్లలో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సులకు అవసరమైన ఛార్జింగ్ సౌకర్యాలను కల్పించడానికి నెడ్‌క్యాప్‌తో చర్చలు జరుపుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుడిపాల నుంచి తమిళనాడుకు జోరుగా ఇసుక అక్రమ రవాణా?

చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...